శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 నవంబరు 2024 (10:45 IST)

ప్చ్.. నా పోస్టులు.. నా సినిమాలు ఒక్క ఓటరును ప్రభావితం చేయలేదు : ఆర్జీవీ (Video)

ramgopalvarma
పోలీసులకు హాజరుకాకుండా డుమ్మా కొడుతూ, అరెస్టుకు భయపడి అజ్ఞాతంలో ఉంటున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఓ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో కూడా తనకు తెలియదన్నారు. పైగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌లు ప్రతీకార రాజకీయాలు చేస్తారని తాను భావించడం లేదన్నారు. 
 
ముఖ్యంగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైకాపాను చిత్తుగా ఓడించి ఏకంగా 164 సీట్లలో గెలవడమే అసలైన ప్రతీకారమన్నారు. తన సినిమాలు, తన పోస్టులు ఒక్క ఓటు(ఓటరు)ను కూడా ప్రభావితం చేయలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ళ్లు పట్టించుకుంటారని అస్సలు అనుకోవడం లేదని, జగన్ పరిపాలన ఎలా ఉందో కూడా తనకు తెలియదన్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి అంటే తనకు మొదటి నుంచి అభిమానం, ప్రేమ అని చెప్పారు.