శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

నిద్రలేని రాత్రులు గడుపుతున్న పోసాని కృష్ణమురళి...

posani krishnamurali
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, సినీ నటుడు చిరంజీవి, వారి కుటుంబ సభ్యులతో పాటు టీవీ5 న్యూస్ చానెల్ అధినేత బీఆర్ నాయుడులను లక్ష్యంగా చేసుకుని సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళి ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడారు. దీంతో ఆయనపై పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదవుతున్నాయి. టీడీపీ, జనసేన, మరికొన్ని ప్రాంతాల్లో టీవీ5 విలేఖరులు పోసానిపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో వారిపై పోలీసులు పోసానిపై కేసులు నమోదు చేస్తున్నారు. 
 
తెలుగు రైతు మీడియా రాష్ట్ర సమన్వయకర్త గింజుపల్లి వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సీఐ జి.శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఈనెల 12న సాక్షి టీవీ లైవ్‌లో పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఇవి అవాస్తవాలని, సామాజానికి హానికరమని పేర్కొన్నారు. సినీ పరిశ్రమపైనా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారని వివరించారు. 
 
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఠాణాలో స్థానిక టీవీస్ విలేఖరి సంగుల మణికంఠ ఫిర్యాదు అందించారు. బీఆర్ నాయుడిపై అనుచిత వాఖ్యలు చేసిన కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ, జనసేన నేతలు కర్నూలు మూడో పట్టణ రాణాలో సీఐ శేషయ్యను కలిసి విజ్ఞప్తి చేశారు. 
 
ప్రకాశం జిల్లా కనిగిరి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు, కావలి, పల్నాడు జిల్లా క్రోసూరు మాచర్ల గ్రామీణం, వినుకొండ పట్టణం, సత్తెనపల్లి, నరసరావుపేట పట్టణం, అనకాపల్లి జిల్లా మునగపాక, నర్సీపట్నం, వైఎస్సార్ జిల్లా మైదుకూరు పోలీసు స్టేషన్లలోనూ ఫిర్యాదులు అందాయి. శ్రీకాకుళం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు కలమట వెంకటరమణ పాతపట్నం సీఐ వి.రామారావును కలిసి ఫిర్యాదు అందించారు. ఇలా అన్ని జిల్లాల్లో పోసానిపై కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు.