శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (15:00 IST)

వివేకా హత్య కేసు : కీలక పరిణామం.. అవినాశ్ బెయిల్‌ రద్దు తప్పదా?

YS Avinash Reddy
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె, వైఎస్ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది మంగళవారం సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. 
 
వివేకా హత్య కేసులో అవినాశ్ ఎనిమిదో నిందితుడుగా ఉన్నారని, ఈ కేసుకు సంబంధించి అతడు కీలకమైన వ్యక్తి అని వెల్లించారు. పైగా, ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వ్యక్తి (దస్తగిరి)ని శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి జైలుకు వెళ్ళి బెదిరించారని సిద్ధార్థ్ లూథ్రా...  సీజేఐ బెంచ్‌కు తెలియజేశారు. ఒక ప్రైవేట్ డాక్టర్‌గా ఉన్న వ్యక్తి జైలులో వెళ్లి సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారని వివరించారు.
 
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా... చైతన్య రెడ్డి రెగ్యులర్‌గా జైలుకు వెళ్ళి ఆరోగ్య పరీక్షలు చేస్తారా అని ప్రశ్నించగా, చైతన్య రెడ్డి రెగ్యులర్‌గా జైలుకు వెళ్లే వ్యక్తి కాదని, నిబంధనలకు విరుద్ధంగా జైలులోకి వెళ్ళారని లూథఅరా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో అవినాశ్, చైతన్య రెడ్డిలను ప్రతివాదులుగా చేర్చాలని కోరారు.
 
ఇరు వర్గాల వాదనలు ఆలకించిన ధర్మాసనం అవినాశ్ రెడ్డి, చైతన్యరెడ్డిలను ప్రతివాదులుగా చేర్చేందుకు అంగీకరించింది. ఈ క్రమలో వారిద్దరికీ నోటీసులు జారీచేసింది. ఆ తర్వాత తదుపరి విచారణను వచ్చే యేడాది మార్చి మొదటి వారానికి వాయిదా వేశారు.