శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2024 (08:47 IST)

డివైడర్‌ను ఢీకొన్న కారు.. లండన్‌లో తెలుగు టెక్కీ దుర్మరణం

death
లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు టెక్కీ ప్రాణాలు కోల్పోయాడు. డివైడర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో కారు బోల్తాపడటంతో టెక్కీ ప్రాణాలు కోల్పోయాడు. ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ చిరంజీవి (32) లండన్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. 
 
ఆయన తన కారులో మిత్రులతో కలిసి ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చిరంజీవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కారులో ఉన్న మరో లుగురు స్నేహితులు గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే, టెక్కీ చిరంజీవి మృతిపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.