శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 31 అక్టోబరు 2024 (17:40 IST)

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

Borugadda Anil Kumar
బోరుగడ్డ అనిల్ పోలీసు వాహనంలో వుండే ప్రముఖ మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చాడు. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పైన సోషల్ మీడియా వేదికగా బోరుగడ్డ అసభ్యకర వ్యాఖ్యలు చేసారంటూ అతడిపైన గార పోలీసు స్టేషనులో మాజీ ఎంపిటిసి సురేష్ ఫిర్యాదు చేసారు. ఈ కేసుకు సంబంధించి బోరుగడ్డను శ్రీకాకుళం జడ్జి ఎదుట హాజరు పరిచి అనంతరం రాజమహేంద్రవరం జైలుకు తరిలిస్తున్నారు.
 
అతడిని పోలీసు వాహనంలో తరలిస్తుండగా... లోపలి నుంచి మాట్లాడుతూ, తనపై వ్యతిరేక వార్తలు రాస్తున్న ఆ 4 మీడియా సంస్థలను నడిరోడ్డుపై నిలబెడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఎస్కార్ట్ వాహనంలోనే ఇలా వార్నింగులు ఇవ్వడం చూసి అక్కడున్నవారు విస్తుపోయారు.