ఆదివారం, 28 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 సెప్టెంబరు 2025 (23:16 IST)

వేడిపాల గిన్నెలో పడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.. ఎక్కడ?

Girl
Girl
అనంతపురం జిల్లాలో బాలిక దారుణంగా మృతి చెందింది. స్కూల్‌లో వేడిపాల పాత్రలో పడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆ చిన్నారి మృతి పట్ల నెటిజన్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన దారుణమని వాపోతున్నారు. పాఠశాలలో ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కృష్ణవేణి అనే మహిళ తన మూడేళ్ల కూతురు అక్షితతో కలిసి విధులు నిర్వహిస్తోంది. 
 
చిన్నారి అక్షిత ఆడుకుంటూ వంట గదిలోకి వెళ్లింది. ఆ సమయంలో విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన వేడి పాలను చల్లబరచడానికి వంటగదిలో ఫ్యాన్ కింద గిన్నెలో పెట్టారు. ఆడుకుంటూ వెళ్లిన అక్షిత ప్రమాదవశాత్తు ఆ వేడి పాల గిన్నెలో పడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు తీవ్రగా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.