శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (20:35 IST)

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి.. జగన్ పిటిషన్.. తీర్పు ఎప్పుడంటే?

Jagan
విదేశాలు వెళ్లేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో యూకే వెళ్లేందుకు అనుమతి కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం జగన్ సీబీఐ కోర్టులో ఫైల్ చేయగా, బుధవారం సీబీఐ కౌంటర్ దాఖలు చేయనుంది.
 
సెప్టెంబరు మొదటి వారంలో యూకేలో చదువుకుంటున్న తన కుమార్తెతో గడిపేందుకు అక్కడికి వెళ్లేందుకు జగన్ అనుమతి కోరారు. ఈ పిటిషన్‌కు సంబంధించి ఇరువురి వాదనలు పూర్తి అవగా.. తీర్పును ఈనెల 27న వెల్లడిస్తామన్న సీబీఐ కోర్టు తెలిపింది.  
 
ఇదిలా ఉంటే, జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి కూడా సెప్టెంబర్ నుండి వచ్చే 6 నెలల్లో 60 రోజుల పాటు విదేశాలకు వెళ్లడానికి అనుమతి కోసం దాఖలు చేశారు. ఈ కేసుపై ఆగస్టు 30న తీర్పు వెలువడనుంది.