ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?
తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, జలుబు, దగ్గు వంటి వాటికి ఉపశమనం ఇస్తుంది. ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. కలబందను ఫస్ట్ ఎయిడ్ కిట్ మొక్క అని కూడా అంటారు. దీని ఆకుల్లోని జెల్ కాలిన గాయాలు, చిన్నపాటి గాయాలు, చర్మ సమస్యలకు ఉపయోగపడుతుంది. ఇది గాలిలోని బెంజీన్, ఫార్మాల్డిహైడ్ వంటి హానికర రసాయనాలను తొలగించి గాలిని శుద్ధి చేస్తుంది. జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది.
స్నేక్ ప్లాంట్ సహజ ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది రాత్రిపూట కూడా కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. అందువలన, దీనిని బెడ్‌రూమ్‌లో పెంచుకుంటే మంచి నిద్రకు, శ్వాసకోశ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బెంజీన్, ఫార్మాల్డిహైడ్ వంటి విషపదార్థాలను తొలగిస్తుంది.
మనీ ప్లాంట్ గాలిలోని కాలుష్య కారకాలను ఫిల్టర్ చేసి, ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఇంట్లో సానుకూల శక్తిని, స్వచ్ఛతను తెస్తుందని నమ్ముతారు. తేమను విడుదల చేసి, ఇంట్లో పొడి వాతావరణాన్ని నివారిస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పీస్ లిల్లీ అత్యంత శక్తివంతమైన ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయర్లలో ఒకటి. ఫార్మాల్డిహైడ్, బెంజీన్, ట్రైక్లోరోఎథైలీన్ వంటి విషపదార్థాలను తొలగించి గాలిని శుభ్రపరుస్తుంది. ఇంట్లో తాజాదనాన్ని, సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను పెంచుతుంది.
పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. దీని సువాసన ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.