శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (15:56 IST)

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

Jagan
Jagan
ఏపీ మాజీ సీఎం జగన్ ఎల్లో మీడియాపై ఫైర్ అయ్యారు. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ సెకీతో ఒప్పందంపై ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. ఈ వ్యవహారంలో 48 గంటల్లో క్షమాపణలు చెప్పాలని.. లేదంటే రెండు సంస్థలపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేయబోతున్నట్లు ప్రకటించారు. 
 
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ల కోసం జర్నలిజం విలువలు వదిలేసి తప్పుడు వార్తలు రాస్తున్న ఎల్లో మీడియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని జగన్ వార్నింగ్ ఇచ్చారు. తాను సంపదను సృష్టి చేస్తే.. చంద్రబాబు ఆవిరి చేస్తున్నారంటూ జగన్ మండిపడ్డారు. 
 
మంచి చేసినోడిపై రాళ్లు వేస్తున్నారంటూ మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో థర్డ్ పార్టీ ఎక్కడుందని ప్రశ్నించారు. ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ ఛార్జెస్ మినహాయిస్తూ ఒప్పందంలో స్పష్టంగా వుంది. 
 
గుజరాత్, రాజస్థాన్‌లో పవర్ జనరేషన్ కాస్ట్ గురించి మాట్లాడుతున్నారని.. ట్రాన్స్ మిషన్ కాస్ట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని జగన్ ప్రశ్నించారు. ధర్మం, న్యాయం లేకుండా మంచి చేసిన వాళ్లపై బండలు వేయడం ఏంటని.. ఎల్లో మీడియాపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
చంద్రబాబు ఆయన సోషల్ మీడియా అయిన ఎల్లో మీడియా ద్వారా తనపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని జగన్ ఫైర్ అయ్యారు. ఛత్తీస్‌గడ్, ఒడిశా కంటే ఏపీకి తక్కువ రేటుకే విద్యుత్ వచ్చింది. ఇందుకు అభినందించాల్సిందిపోయి.. మాటలంటున్నారని ఫైర్ అయ్యారు. 
 
ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలను వక్రీకరిస్తున్నాయని జగన్ మండిపడ్డారు. ఈ వ్యవహారంలో 48 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే.. పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. 
 
కాగా మీడియా సమావేశంలో ఎల్లో మీడియాపై జగన్ ఫైర్ అయిన తాలుకూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జగన్ లుక్‌పై కామెంట్లు వస్తున్నాయి. నెరసిన జుట్టు, డల్ అయిన ఫేస్‌తో జగన్ కనిపిస్తున్నారని ఆయన ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.