గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జనవరి 2025 (12:02 IST)

సూత్రధారి సజ్జల భార్గవరెడ్డి .. డబ్బంతా ఆయనే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి

varra ravindra reddy
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేసారు. ప్రస్తుతం ఆయన వద్ద కోర్టు అనుమతితో విచారణ జరుపుతున్నారు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ సాథ్యంలోని పోలీసులు బుధవారం కడప సెంట్రల్ జైలు నుంచి వర్రాను సైబర్ స్టేషన్‌కు తరలించి విచారించారు. 
 
'సజ్జల భార్గవ రెడ్డి, రామకృష్ణా రెడ్డి సూచనల మేరకే పోస్టులు పెట్టాం. మాకు డబ్బులు ఇవ్వలేదు. మా పేరు చెప్పి సజ్జల భార్గవ రెడ్డి సొమ్ములు కొట్టేశారు. మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, పార్టీ అండగా ఉంటుందని హామీ ఇవ్వడంతో పోస్టులు పెట్టాను. అయితే, వీటిలో 18 నావి కాదు. నా పేరిట ఫేక్ ఖాతాలు సృష్టించి పోస్టులు పెట్టారు' అని విచారణలో వర్రా చెప్పినట్లు తెలిసింది.
 
కాగా, వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌చార్జ్ సజ్జల భార్గవరెడ్డి, ఆయన తండ్రి, అప్పటి ప్రభుత్వ సలహాదారు రామకృష్ణా రెడ్డి చెబితేనే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినట్టు చెప్పారు. వారి ప్రోద్బలంతోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్, అనిత, షర్మిల, విజయలక్ష్మి ఇతరులపై అసభ్య పోస్టులు పెట్టామని వైసీపీ సోషల్ మీడియా కడప జిల్లా కోకన్వీనర్ వర్రా రవీంద్రా రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.