శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-10-2024 బుధవారం దినఫలితాలు : వ్యాపారాలు ఊపందుకుంటాయి....

Cancer
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కలిసివచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి, ఉద్యోగ బాధ్యతలపై దృష్టి పెట్టండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కీలక పత్రాలు అందుకుంటారు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య పరీక్షలు అనివార్యం. ఉపాధి పథకాలు చేపడతారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఓర్పుతో మెలగండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పనులు హడావుడిగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ప్రధానం. ఆహ్వానం అందుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణ విముక్తులవుతారు. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పరిచయాలు బలపడతాయి. పనులు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిచయాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. పనులు చురుకుగా సాగుతాయి.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. రావలసిన ధనం అందుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దూరపు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. దంపతుల మధ్య అకారణ కలహం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమర్ధతను చాటుకుంటారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ధనలాభం ఉంది. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. ప్రముఖులకు మరింత సన్నిహితులవుతారు. మీ జోక్యం అనివార్యం. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మాటతీరు ఆకట్టుకుంటుంది. మీ కష్టం వృధాకాదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉల్లాసంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఓర్పుతో యత్నాలు సాగిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆరోగ్యం సంతృప్తికరం. పనులు వేగవంతమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో సతమతమవుతారు. పనులు ముందుకు సాగవు. చిన్న విషయానికే ఆవేశపడతారు. మిత్రులే వ్యతిరేకులవుతారు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు అధికం. సంతానం యత్నాలు ఫలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృక్పథంతో మెలగండి. గత అనుభవాలు మరిచిపోవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్ర వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.