మేషం : ఆశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఖర్చులు అధికం. చీటికిమాటికి అసహనం చెందుతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆరోగ్యం జాగ్రత్త.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. ఆప్తులను కలుసుకుంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ ఓర్పునేర్పులకు పరీక్షా సమయం. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
స్థిరాస్తి ధనం అందుతుంది. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. అనవసర జోక్యం తగదు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. మొండి బాకీలు వసూలవుతాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. సాయం ఆశించవద్దు. స్వశక్తితోనే కార్యం సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. పనులు ఒక పట్టాన సాగవు. కొందరి వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం శూన్యం. ఆర్థికస్థితి నిరాశాజనకం. ఆలోచలతో సతమతమవుతారు. దంపతుల మధ్య అకారణ కలహం. అనునయంగా మెలగండి. పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తుల కలయిక వీలుపడదు. వ్యవహార లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమర్ధతను చాటుకుంటారు. అందరిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అర్ధాంతంగా నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యం నెరవేరుతుంది. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. వివాహయత్నం ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. కీలకపత్రాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఎదుర్కుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు సామాన్యం.. ఆరోగ్యం కుదుటపడుతుంది. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. గృహమార్పు తలపెడతారు. ఆహ్వానం అందుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. పనులు, కార్యక్రమాలు సాగవు. చిన్న విషయానికే ఉద్రేకపడతారు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. పనులు ముందుకు సాగవు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు సామాన్యం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. గత సంఘటనలు మరిచిపోవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు.