ఆదివారం, 28 సెప్టెంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-09-2025 శనివారం ఫలితాలు - వ్యతిరేకులు సన్నిహితులవుతారు...

astro6
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అన్నివిధాలా అనుకూలమే. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో చర్చలు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పనులు త్వరితగతిన సాగుతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆశావహదృక్పథంతో శ్రమించండి. విమర్శలు పట్టించుకోవద్దు. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఊహించని ఖర్చులుంటాయి. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ తప్పిదాలను సరిదిద్దుకుంటారు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సమర్ధతను చాటుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. గుట్టుగా మెలగండి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఖర్చులు సామాన్యం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి, సోదరులను సంప్రదిస్తారు. ఆప్తుల సలహా పాటించండి.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. సన్నిహితులకు సాయం అందిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ప్రయాణం తలపెడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. మానసికంగా కుదుటపడతారు. వ్యవహారాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వాగ్దాటితో నెట్టుకొస్తారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. ఒక సమస్య నుంచి బయటపడతారు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. అవకాశాలు కలిసివస్తాయి. అవసరాలకు ధనం అందుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. నోటీసులు అందుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలు కొనసాగించండి. పనులు సాగక విసుగు చెందుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఊహించని ఖర్చు ఎదురువుతుంది. రాబడిపై దృష్టి పెడతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. పంతాలకు పోవద్దు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. పెద్ద మొత్తం ధనసహాయం తగదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోండి. వేడుకకు హాజరవుతారు.