మంగళవారం, 7 అక్టోబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 సెప్టెంబరు 2025 (23:14 IST)

22-09-2025 సోమవారం ఫలితాలు - నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త....

astro8
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు అప్పగించవద్దు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆహ్వానం అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో వ్యవహరిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. బెట్టింగులకు పాల్పడవద్దు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
మనోధైర్యంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ ప్రభావం చూపుతాయి. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చు చేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు హడావుడిగా సాగుతాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రావలసిన ధనం అందదు. నిస్తేజానికి లోనవుతారు. కొన్ని సంఘటనలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఖర్చులు విపరీతం. సాయం పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సన్నిహితులతో సంభాషిస్తారు. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. సంతోషకరమైన విషయం తెలుసుకుంటారు. ఆప్తుల కలయిక వీలుపడదు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పనులు త్వరితగతిన సాగుతాయి. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. కార్యక్రమాలు నిర్విరామంగా సాగుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. గృహమార్పు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పాత పరిచయస్తులు తారసపడతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉంటారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, పట్టించుకోవద్దు. ఖర్చులు విపరీతం. పనులు వేగవంతమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శుభకార్యానికి హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. కీలక పత్రాలు అందుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ఆకస్మిక ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు సామాన్యం. పనులు పురమాయించవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.