శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (23:13 IST)

ఎసుస్: హైదరాబాద్‌లో మొదటి అసుస్ సెలెక్ట్ స్టోర్‌ ప్రారంభం

Asus
పర్యావరణ అనుకూల ప్రయత్నాల మద్దతుతో నూతన ఆవిష్కరణలకు కట్టుబడిన, దేశంలోని ప్రముఖ పిసి బ్రాండ్ అయిన ఎసుస్ ఇండియా ఈరోజు రీఫర్భిష్డ్( పునరుద్ధరించిన) ఉత్పత్తులతో తమ 4వ సెలెక్ట్ స్టోర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో ప్రారంభించబడుతున్న ఈ స్టోర్,  నగరంలో తొలి స్టోర్, వినియోగదారులకు తగ్గింపు ధరలలో వివిధ రకాల పునరుద్ధరించిన ల్యాప్‌టాప్‌లను అందిస్తుంది, అన్నింటికీ 1-సంవత్సరం ఎసుస్ వారంటీ మద్దతు ఉంది. కొత్త ఎసుస్ సెలెక్ట్ స్టోర్ 315 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. వివోబుక్, జెన్‌బుక్, రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ (ROG) ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ డెస్క్‌టాప్‌లు, ఆల్ ఇన్-వన్ డెస్క్‌టాప్‌లు, ఉపకరణాలు వంటి అసుస్ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తులతో సహా విస్తృతమైన ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ హార్డ్‌వేర్‌లను ఇక్కడ అందించనున్నారు. 
 
స్టోర్ ప్రారంభం గురించి ఎసుస్ ఇండియా వైస్ ప్రెసిడెంట్- గేమింగ్, కన్స్యూమర్ సెగ్మెంట్, ఆర్నాల్డ్ సు మాట్లాడుతూ, “పర్యావరణ అనుకూల  సాంకేతికత ఎంపికలతో దేశాన్ని శక్తివంతం చేయాలనే మా ప్రయత్నంలో, మేము మా 4వ పునరుద్ధరించిన ఉత్పత్తుల స్టోర్‌ను హైదరాబాద్ నగరంలో  ప్రారంభించబోతున్నందుకు గర్విస్తున్నాము. సస్టైనబిలిటీకి బలమైన ప్రచారకులుగా, మా చివరి మూడు ఎసుస్ సెలెక్ట్ స్టోర్ల కస్టమర్‌ల నుండి ఆదర్శప్రాయమైన ప్రతిస్పందనలను రికార్డ్ చేసినందున, మా రిటైల్ నెట్‌వర్క్‌ను ఏకకాలంలో పటిష్టపరిచేందుకు ఇదే సరైన చర్య అని మేము నమ్ముతున్నాము. నగరంలో పునరుద్ధరింపబడిన ల్యాప్‌టాప్‌లను ఎంచుకునే వ్యక్తుల సంఖ్య పెరుగుతున్నందున, కస్టమర్‌లు ప్రీమియం-నాణ్యత కలిగిన ల్యాప్‌టాప్‌లు, పిసిలను యాక్సెస్ చేసేలా, క్షుణ్ణంగా పరిశీలించిన ఉత్పత్తులను అందించే ప్లాట్‌ఫారమ్‌ను అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అన్నారు.