శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2024 (15:54 IST)

సితార పేరిట ఫేక్ ఐడీ.. ట్రేడింగ్ లింకులు.. తాట తీస్తాం.. నమ్రత వార్నింగ్

Sitara
సూపర్ స్టార్ మహేష్ బాబు, అతని భార్య, మాజీ నటి నమ్రతా శిరోధ్కర్, వారి కుమార్తె సితార నకిలీ సోషల్ మీడియా ఖాతాకు సంబంధించి వారి అభిమానులు, అనుచరులను హెచ్చరించారు. శనివారం నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారిక ప్రకటనను పంచుకున్నారు
 
సితార ఫేక్ సోషల్ మీడియా ఖాతాపై సైబర్ క్రైమ్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, సితార ఫేక్ అకౌంట్‌కు సంబంధించిన వ్యక్తిని త్వరలోనే కనుగొంటామని చెప్పారు. ఫేక్ ఐడీతో సితార పేరును ఉపయోగించి ఇతర వినియోగదారులకు ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ లింక్‌లను పంపుతున్నాడని పేర్కొన్నారు. తన కుమార్తె అధికారిక ఖాతాను కూడా ట్యాగ్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఏకైక ఖాతా అని చెప్పారు.
 
అధికారిక ఖాతాను తప్ప మరే ఇతర ఖాతాను విశ్వసించవద్దని తన అనుచరులను నమ్రత అభ్యర్థించారు. ఇలాంటి ఫేక్ ఐడీల పేరిట నాటకాలాడే వారి తాట తీస్తామని నమ్రత హెచ్చరించారు. 
 
ఇన్‌స్టాగ్రామ్‌లో సితార ఘట్టమనేని పేరిట ఫేక్ ఐడీని గుర్తించడం జరిగింది. సైబర్ క్రైమ్ ఘటనపై మాదాపూర్ పోలీసులు, టీమ్ జీఎంబీకి సంబంధించి హెచ్చరిక జారీ చేశారు. గుర్తు తెలియని యూజర్ సితార ఘట్టమనేనిగా చెప్తూ వినియోగదారులకు ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ లింక్‌లను పంపుతున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.