శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 11 సెప్టెంబరు 2024 (14:16 IST)

అవివా సిగ్నేచర్ ఇన్ క్రీజింగ్ ఇన్ కమ్ ప్లాన్‌తో పదవీ విరమణ భద్రతను మెరుగుపరిచిన అవివా ఇండియా

భారతదేశం అత్యంతగా విశ్వశించే ప్రైవేట్ జీవిత బీమా బ్రాండ్ అవివా లైఫ్ ఇన్స్యూరెన్స్. ఇది  నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, జీవిత బీమా సేవింగ్స్ ప్లాన్ (యుఐఎన్: 122N158V01) అవివా సిగ్నేచర్ ఇన్ క్రీజింగ్ ఇన్ కమ్ ప్లాన్ ఆరంభాన్ని ప్రకటించింది. పోస్ట్-రిటైర్మెంట్ ఆదాయ ప్రవాహం గ్యారంటీగా మరియు అభివృద్ధి చెందడానికి మరియు కస్టమర్లు తమ బంగారు సంవత్సరాలలో స్వేచ్ఛగా తమ #LiveLife లో సహాయపడటానికి ప్రత్యేకించి ఈ ప్లాన్ రూపొందించబడింది. జీవించే కాలం పెరుగుతుండటం, పెరుగుతున్న జీవన వ్యయంతో రిటైర్మెంట్ లో ఆర్థిక భద్రత అనేది ఇంతకు ముందు కంటే చాలా కీలకంగా మారింది. అవివా సిగ్నేచర్ ఇన్ క్రీజింగ్ ఇన్ కమ్ ప్లాన్ ఈ సమస్యలను పరిష్కరించింది మరియు మార్కెట్లో ప్రత్యేకంగా నిలిచే వినూత్నమైన ఫీచర్స్‌ను అందిస్తోంది.

ప్రతి 3వ పాలసీ సంవత్సరంలో నెలకు 15% స్టెప్-అప్ తో ఈ ప్లాన్ ద్రవ్యోల్బణాన్ని పరిష్కరిస్తుంది, అనగా కాల క్రమేణా, చెల్లింపులు ద్రవ్యోల్బణం సంబంధంలో పెరుగుతాయి, కాబట్టి పాలసీదారు కొనుగోలు శక్తికి సహాయం అందించబడుతోంది. అవివా సిగ్నేచర్ ఇన్ క్రీజింగ్ ఇన్ కమ్ ప్లాన్ గ్యారంటీడ్ హోల్-లైఫ్ ఇన్ కమ్ ను కేటాయిస్తుంది, పాలసీదారుకు ఆదాయ ప్రయోజనాలను నిర్థారిస్తుంది మరియు 100 ఏళ్ల వరకు సమగ్రమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది. అదనంగా, చెల్లింపు  సమయం చివరిలో ఇది ప్రీమియాలను వాపసు చేస్తుంది.  దీని ప్రకారం పాలసీదారు చెల్లించిన మొత్తం ప్రీమియాలలో 105% తిరిగి పొందుతాడు, తద్వారా ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనం మెరుగవుతుంది. సరళమైన ప్రీమియం చెల్లింపు ఫ్రీక్వెన్సీతో, ప్లాన్  సురక్షితమైన రిటైర్మెంట్ కోసం నిరంతరంగా నెలవారీ ఆదాలకు అనుమతి ఇస్తుంది, విస్తృత శ్రేణి కస్టమర్లకు అందుబాటులో ఉంచుతుంది.


పాలసీ అవధి సమయంలో పాలసీదారు మరణించితే, సమస్యాత్మకమైన సమయంలో గ్యారంటీడ్ డెత్ బెనిఫిట్ కీలకమైన ఆర్థిక మద్దతు కేటాయిస్తుంది. దీనిలో ఇన్-బిల్ట్ ప్రీమియం గ్యారంటీ విలువైన ఫీచర్ గా చెప్పవచ్చు. దీని ప్రకారం అవివా పాలసీదారు తరపున బకాయిపడిన అన్ని భవిష్య ప్రీమియాలను చెల్లిస్తుంది మరియు కస్టమర్ కి వాగ్థానం చేసిన గ్యారంటీడ్ ఇన్ క్రీజింగ్ ఇన్ కమ్ ను కుటుంబం పొందుతుంది. శ్రీ వినీత్ కపాహి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు మార్కెటింగ్ హెడ్ ఇలా అన్నారు, “అవివా సిగ్నేచర్ 3డి టెర్మ్ ప్లాన్ తో మా కస్టమర్ల రక్షణ అవసరాలను తీర్చిన తరువాత మరియు అవివా సిగ్నేచర్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్-ప్లాటినమ్ ద్వారా సంపదను  మెరుగుపరిచిన తరువాత, ఈ త్రైమాసికంలో మేము ప్రారంభించే 3వ ఉత్పత్తి గ్యారంటీడ్ పోస్ట్-రిటైర్మెంట్ ఆదాయం పొందడం కోసం రూపొందించబడింది. నేటి ఊహించలేని ఆర్థిక స్థితిలో, ఈ ప్లాన్ వృద్ధి, ద్రవ్యోల్బణం-ప్రూఫ్ గల ఆదాయ ప్రవాహాన్ని అందిస్తోంది, ఇది మా కస్టమర్లు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన రిటైర్మెంట్ ను ఆనందించడాన్ని నిర్థారిస్తుంది. అవివా సిగ్నేచర్ ఇన్ క్రీజింగ్ ఇన్ కమ్ ప్లాన్ వినూత్నతకు మా నిబద్ధతకు చిహ్నంగా నిలిచింది మరియు మా కస్టమర్ల భవిష్య ఆర్థిక అవసరాలతో అనుసంధానంగా ఉంటుంది.”

 
కీలకమైన ఫీచర్స్:
జీవిత బీమా: వార్షిక ప్రీమియం యొక్క 7 లేదా 11 రెట్లు జీవిత బీమా కవరేజ్ ను ఇస్తుంది.
లైఫ్ లాంగ్ ఇన్ కమ్ గ్యారంటీ:  ప్రతి మూడవ పాలసీ వార్షికోత్సవానికి 15% పెంపుదలతో 100 ఏళ్ల వయస్సు వరకు నెలకు గ్యారంటీడ్ ఆదాయం అందిస్తుంది.
ఇన్ బిల్ట్ ప్రీమియం గ్యారంటీ బెనిఫిట్: ప్రీమియం చెల్లింపు అవధి సమయంలో లైఫ్ అష్యూర్డ్ మరణిస్తే, ప్రణాళిక చేసిన విధంగా  క్లైమెంట్ భవిష్య ప్రీమియాల బకాయిలు చెల్లించవలసిన భారం లేకుండా దీర్ఘకాలం ఇన్ క్రీజింగ్ ఇన్ కమ్ అందుకుంటాడు.
ప్రీమియాలు వాపసు చేయడం:  చెల్లింపు సమయం చివరిలో చెల్లించిన మొత్తం ప్రీమియాలలో 105% వాపసు చేస్తుంది.
ఆప్షనల్ రైడర్స్: అవివా యాక్సిడెంటల్ కాజువాల్టి నాన్-లింక్డ్ రైడర్ మరియు అవివా న్యూ క్రిటికల్ ఇల్ నెస్ నాన్-లింక్డ్ రైడర్ తో మెరుగుపరచబడిన రక్షణ.
ప్రీమియాలు మరియు చెల్లింపులపై పన్ను ప్రయోజనం: ప్రస్తుతమున్న పన్ను చట్టాలు ప్రకారం పన్ను ప్రయోజనాలు.
లోన్ సదుపాయం: ఈ ప్లాన్ కింద లోన్స్ లభిస్తాయి.