శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (09:29 IST)

సరికొత్త ఫీచర్లతో జియో ప్రైమా-2 పేరుతో కొత్త మొబైల్

jio prime-2 phone
దేశంలో అగ్రగామి ప్రైవేట్ టెలికామ్ సంస్థగా ఉన్న రిలయన్స్ జియో ఇపుడు సరికొత్త మొబైల్‌‍ను తీసుకొచ్చింది. గతంలో ఉన్న జియో ప్రైమా మొబైల్‌కు సరికొత్త ఫీచర్లను జోడించి జియో ప్రైమా-2 పేరుతో ఈ ఫోనును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ మొబైల్ ఫోనులో యూపీఐ పేమెంట్స్ చేసుకునే సదుపాయం కూడా ఏర్పాటు చేయడం మరో విశేషం. 
 
గత యేడాది లాంచ్ చేసిన జియో ప్రైమా మొబైల్‌కు కొనసాగింపుగా జియో ప్రైమా 2 పేరుతో కొత్త ఫోన్ను మార్కెట్లో విడుదల చేసింది. పాత ఫోన్‌ను మరిన్ని మెరుగైన ఫీచర్లను జోడించింది. తాజా మార్కెట్‌లోకి విడుదల చేసిన జియో ప్రైమా-2 మొబైల్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి..? దీని ధర ఎంత..? తదితర పూర్తి వివరాలు ఒకసారి పరిశీలిస్తే...
 
జియో ప్రైమా 2 ఫోనును 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ప్రవేశపెట్టారు. ఈ ఫోన్ ధరను రూ.2,799గా నిర్ణయించారు. బ్లూ కలర్లో ఈ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. చిన్న ఫీచర్ ఫోనులో ఫ్రంట్ కెమెరాను అందించడం విశేషం. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
 
జియో ప్రైమా 2 మొబైల్ లో 2.4 అంగుళాలతో కూడిన కర్వడ్ స్క్రీన్‌ను అందించారు. కీ ప్యాడ్ పని చేసే ఈ మొబైల్‌లో క్వాల్ కామ్ చిప్ సెట్ ప్రొసెసర్‌ను అందించారు. ఫోనులో 2000 ఎంఏహెచ్ వంటి పవర్ ఫుల్ బ్యాటరీని అమర్చారు. 
 
ఈ మొబైల్ సింగిల్ న్యానో సిమ్‌ను సపోర్టు చేస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ వంటి యాడ్స్‌కు ఈ మొబైల్ సపోర్టు చేస్తుంది. వాట్సాప్, ఫేస్‌బుక్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. 4జీ కనెక్టివిటీకి సపోర్టు చేసే ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్‌‍న్ను ఇచ్చారు. ఈ మొబైల్లో యూపీఐ పేమెంట్స్ చేసుకునే సదుపాయం ఏర్పాటు చేయడం మరో విశేషంగా పేర్కొంటున్నారు. ఈ మొబైల్ 23 భాషలకు సపోర్టు చేస్తుంది.