శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (18:56 IST)

హిల్సా చేపలు.. ఇక భారత్‌కు పంపేది లేదు.. బంగ్లాదేశ్ బ్యాన్

Hilsa
Hilsa
పశ్చిమ బెంగాల్‌లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. నవరాత్రుల సందర్భంగా బెంగాల్ లో ప్రత్యేక వంటకాలు సిద్ధం చేసి అతిథులకు వడ్డిస్తుంటారు. బెంగాల్‌లో నవరాత్రులు అంటే హిల్సా చేప ఉండాల్సిందే. ప్రజలు ఈ చేపను దుర్గామాతకు నైవేద్యంగా కూడా సమర్పిస్తారు.

గోదావరి పులసలాగానే బంగ్లాదేశ్‌లో హిల్సా బాగా ఫేమస్‌. బంగ్లాదేశ్‌‌లోని పద్మా నదిలో పుట్టే చేపలు కాబట్టే వీటికి పద్మా పులస అనే పేరొచ్చింది. ఇది పశ్చిమబెంగాల్ కి వచ్చే సరికి హిల్సాగా మారిపోతుంది. ఈ హిల్సా చేపకు నవరాత్రుల సందర్భంగా బాగా డిమాండ్. 
 
అయితే ఈ ఏడాది హిల్సా చేపలను భారత్‌కు దిగుమతి చేయబోమని బంగ్లాదేశ్ తెలిపింది. దుర్గాపూజ సందర్భంగా భారతదేశానికి హిల్సా చేపలను ఎగుమతి చేయడాన్ని బంగ్లాదేశ్ నిషేధించింది. 
 
హిల్సా చేపలను భారత్‌కు ఎగుమతి చేయబోమని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది నిషేధం విధించడం వల్ల బెంగాల్‌లో హిల్సా చేపల ధరలు ఆకాశాన్నంటనున్నాయంటున్నారు వ్యాపారులు, ప్రజలు.