శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 20 నవంబరు 2024 (22:09 IST)

అల్లు అర్జున్ నటించిన “నేను థండర్” ప్రచారాన్ని ప్రారంభించిన థమ్స్ అప్

Allu Arjun
ఘాటైన రుచి, ఉరుములతో కూడిన స్ఫూర్తికి పేరుగాంచిన భారతదేశపు ఐకానిక్ బిలియన్-డాలర్ బ్రాండ్ థమ్స్ అప్, సూపర్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన తన తాజా ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ బోల్డ్ కొత్త ప్రచారం, పుష్ప 2 చుట్టూ సందడి తీవ్రతరం అవుతున్న కొద్దీ, థమ్స్ అప్ మరియు అల్లు అర్జున్ ఇద్దరి అభిమానులను ఆకర్షిస్తుంది. ‘నేను థండర్’ అనే ప్రధాన సందేశం చుట్టూ నిర్మితమైన థమ్స్ అప్, ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న వారి మార్గంలో వచ్చిన ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే వారితో ప్రతిధ్వనించే బలమైన, బోల్డ్ రుచిని అందజేస్తుంది. ఈ శక్తివంతమైన అనుబంధంలో భాగంగా, అభిమానుల కోసం కలెక్టర్ ఐటమ్‌గా, ఈ భాగస్వా మ్యానికి పరిపూర్ణ ధన్యవాదాలుగా ఈ బ్రాండ్ త్వరలో అల్లు అర్జున్‌తో కూడిన ప్రత్యేక-ఎడిషన్ థమ్స్ అప్ క్యాన్‌లను ఆవిష్కరించనుంది.
 
కోకా-కోలా ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఏషియా స్పార్క్లింగ్ ఫ్లేవర్స్ కేటగిరీ హెడ్ సుమేలీ ఛటర్జీ మాట్లాడుతూ, “థమ్స్ అప్ ఎల్లప్పుడూ ధైర్యమైన కొత్త ఆలోచనలు చేస్తుంది. తన వినియోగదారులకు అసాధారణ అనుభవా లను అందించడం కోసం నిలుస్తుంది. ‘నేను థండర్’  ప్రచార కార్యక్రమంతో మేం ఈ బ్రాండ్   బలం, అల్లు అర్జున్ చరిష్మా పరిపూర్ణ కలయికను పొందడానికి ప్రయత్నించాం. ఈ డిసెంబర్‌లో మేం మా వినియోగదారులను ఉత్కంఠలో ఉంచడానికి వేదికను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి, మీ ఐస్-కోల్డ్ థమ్స్ అప్ పట్టుకోండి-ఇక ఇది మరింత తీవ్రతరం కానుంది!’’ అని అన్నారు.
 
ఓగిల్వీ ఇండియా ఆకట్టుకునే రీతిలో రూపొందించిన అద్భుతమైన టీవీసీలో, అల్లు అర్జున్ ప్రతి ఫ్రేమ్‌లో శక్తివంతంగా కనిపిస్తారు. బాటిల్‌పై తనకున్న నమ్మకమైన పట్టు నుండి థమ్స్ అప్ తిరుగులేని స్ట్రాంగ్ రుచికి వీక్షకులను నడిపించాడు. ప్రతి షాట్ యాక్షన్‌తో నిండి ఉంది, థమ్స్ అప్ యొక్క రష్‌కి ఇది ప్రాణం పోసింది. అల్లు అర్జున్ మాట్లాడుతూ, థమ్స్ అప్ వంటి దిగ్గజ బ్రాండ్‌తో కలిసి పనిచేయడానికి నేను సంతోషిస్తున్నాను. పుష్ప పాత్ర వలెనే ఎవరైనా తమ సొంత మార్గాన్ని ఏర్పరచుకోవాలని, జీవితంలో ఎలాంటి సవాలునైనా దానికి లొంగకుండా తీసుకోవాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. థమ్స్ అప్ కూడా ఈ సాహసోపేతమైన, తిరుగులేని స్ఫూర్తిని పంచుతోంది. భారతీయ యువతకు ఇది బలం, నిజమైన సాహసంతో స్ఫూర్తినిస్తుంది, శక్తినిస్తోంది’’ అని అన్నారు.
 
ఓగిల్వీ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ రీతు శారదా మాట్లాడుతూ, ‘‘అల్లు అర్జున్ పిడుగులా మారి అనుకరించడానికి వీల్లేని విధంగా తనదైన తిరుగులేని శైలిలో ప్రకటించాడు. అంతకు మించింది మరేముంది? ఈ ఉరుములతో కూడిన సమ్మేళనాన్ని ప్రపంచమంతా చూసేందుకు మేం చాలా సంతోషిస్తున్నాం’’ అని అన్నారు. థమ్స్ అప్, అల్లు అర్జున్ కలిసినందున, ప్రేక్షకులు హీరోయిజం ఫీట్‌లతో నిండిన సీజన్ కోసం ఎదురు చూడవచ్చు. బ్లాక్‌బస్టర్ విడుదల నుండి ప్రత్యేకమైన ప్రత్యేక-ఎడిషన్ థమ్స్ అప్ క్యాన్‌ల వరకు. పరిశ్రమలోని కొందరు ప్రముఖ వ్యక్తులను కలిగి ఉన్న ఐకానిక్ భాగస్వామ్యాల వారసత్వంతో, థమ్స్ అప్ ‘నేను థండర్’ ప్రచారం మరింత శక్తివంతమైన ‘పిడుగు’ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రచారం ఇంకా రాబోయే పెద్ద అనుభూతులకు సంక్షిప్తరూపం మాత్రమే కావచ్చు.