శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2024 (15:50 IST)

విశాఖపట్నం- విజయవాడలకు కొత్త విమాన సేవలు... ఆదివారాల్లో?

indigo
విశాఖపట్నం- విజయవాడలను కలుపుతూ రెండు అదనపు విమానాలు త్వరలో ప్రారంభమవుతాయి. ఆదివారాల్లో ఈ సేవలు వుంటాయి. ఆదివారం నుంచి ఇండిగో-ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లచే నిర్వహించబడుతున్న ఈ కొత్త సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. 
 
ఇండిగో విమానం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 7:15 గంటలకు బయలుదేరి రాత్రి 8:20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి తిరుగు ప్రయాణంలో ఉదయం 8:45 గంటలకు బయలుదేరి 9:50 గంటలకు విజయవాడ చేరుకోవాల్సి ఉంది. 
 
కాగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం విశాఖపట్నంలో ఉదయం 9:35 గంటలకు బయలుదేరి 10:35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 7:55 గంటలకు విజయవాడ బయలుదేరి రాత్రి 9:00 గంటలకు తిరిగి విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ సర్వీసులతో విజయవాడ-విశాఖపట్నం మధ్య విమాన సర్వీసుల సంఖ్య 3కి పెరగనుంది.