శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (17:58 IST)

మద్యం మత్తులో రోడ్డుపై టీ షర్టు లేకుండా అందరినీ కొరికేశాడు..

chennai
chennai
సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ వ్యక్తి వింత ప్రవర్తనతో ప్రజలను హడలెత్తించాడు. ఓ విదేశీయుడు మద్యం మత్తులో వీరగం సృష్టించాడు. మరో వ్యక్తితో కలిసి మద్యం మత్తులో టీషర్ట్‌ను తీసివేసి చెన్నైలోని రాయపేట జంక్షన్ వీధిలో తిరుగుతూ కనిపించాడు. పోలీసులు రంగంలోకి దిగినప్పటికి, కేవలం షార్ట్‌లు ధరించి తాగిన వారిలో ఒకరు వీధుల్లో ఎలా తిరుగుతున్నారో వీడియోలో చూడవచ్చు. 
 
ఇంకా రద్దీగా ఉండే రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని టార్గెట్‌ చేసి కొరికిపెట్టాడు. దీంతో బైక్ రైడర్ షాక్ అయ్యాడు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని పోలీసులు చాలా కష్టం మీద అదుపులోకి తీసుకుని ఈడ్చుకెళ్లాల్సి వచ్చింది. మరో వ్యక్తి కూడా మద్యం మత్తులో ఇతరులపై దాడి చేయడం, కొరకడం చేశాడు. అతనిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల గుర్తింపు ఇంకా ధృవీకరించబడలేదు.