శుక్రవారం, 12 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 సెప్టెంబరు 2025 (15:30 IST)

ఎస్పీబీ చరణ్‌ను విసిగిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్!!

spb charan
దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సినీ నేపథ్య గాయకుడు ఎస్పీబీ చరణ్‌ను ఒక అసిస్టెంట్ దర్శకుడు విసిగిస్తున్నారు. ఇంటి అద్దె చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీంతో ఎస్పీబీ చరణ్ చెన్నై పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన చెన్నై కేకే నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
చెన్నై సాలిగ్రామం, సత్యా గార్డెన్‌లో ఉన్న ఓ అపార్టుమెంటులో తమకు ఓ ఫ్లాటు ఉందని, అందులో తమిళ చిత్ర పరిశ్రమలో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న తిరుజ్ఞానం అద్దెకు ఉంటున్నారన్నారు. నెలకు రూ.40,500 చెల్లిస్తానని అంగీకారం దుర్చుకున్నారని తెలిపారు. ఆయన నుంచి అడ్వాన్స్ రూ.1.50 లక్షలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. 
 
అయితే, గత 25 నెలలుగా తిరుజ్ఞానం అద్దె చెల్లించడం లేదని, ఇటీవల ఆయనను అడగ్గా తనతో అసభ్యకరంగా మాట్లాడి, బెదిరింపులకు దిగాడన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని, అద్దె డబ్బులు ఇప్పించి ఇంటిని ఖాళీ చేయించాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.