1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. తారల ఫోటో గ్యాలెరీ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (17:39 IST)

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

mahesh babu
తనకు షూటింగ్ ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోయానని, అందువల్ల తనకు కాస్త సమయం ఇవ్వాలని సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులను కోరారు. సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టులకు సంబంధించిన కేసుల్లో కొన్ని రోజుల క్రితం మహేశ్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
ఆ రెండు సంస్థలకు ఆయన ప్రచారకర్తగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇన్‌‍ఫ్లూయెన్స్ చేశారనే అభియోగంపై మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు జారీచేసింది. ఈ సంస్థలకు ప్రచారం చేసినందుకు మహేశ్ బాబు భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అయితే, షూటింగ్ ఉన్నందు సోమవారం విచారణకు హాజరుకాలేకపోతున్నానని, అందువల్ల తనకు మరికొంత సమయం ఇవ్వాలని ఈడీ అధికారులను ఆయన కోరారు. 
 
కాగా, ఈడీ పంపించిన నోటీసుల ప్రకరాం మహేశ్ బాబు ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం ఉదయం 10.30 గంటలకు బషీర్ బాగ్‍లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సివుంది. అయితే, ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో తాను హాజరుకాలేకపోవడానికి గల కారణాలు వివరిస్తూ ఈడీకి లేఖ రాశారు.