శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (12:06 IST)

దులీప్ ట్రోఫీలో శతక్కొట్టిన సంజూ శాంసన్.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడుగా..

Sanju Samson
Sanju Samson
దులీప్ ట్రోఫీలో ఎట్టకేలకు ఓ సెంచరీ బాది ఫామ్‌లోకి వచ్చాడు సంజూ శాంసన్. ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్ లో వన్డే స్టైల్లో సెంచరీ బాది ఔరా అనిపించాడు. దాంతో తన టీమ్ అయిన ఇండియా-డి పటిష్ట స్థితిలో నిలిచింది. 
 
దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్ లో అద్బుతమైన సెంచరీతో అలరించాడు టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్. ఈ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 94 బంతుల్లో శతకం బాదాడు. 
 
ఈ క్రమంలోనే వన్డే స్టైల్లో 94 బంతుల్లో సెంచరీ బాదేశాడు. దాంతో జట్టు పటిష్టమైన స్థితిలో నిలిచింది. కాగా.. శాంసన్ కు ఇది 11వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. సంజూ సెంచరీకి తోడు రికీ భుయ్(56), శ్రీకర్ భరత్(52), దేవదత్ పడిక్కల్ (50) అర్థ సెంచరీలతో రాణించడంతో.. ఇండియా-డి 84 ఓవర్లలో 8 వికెట్లకు 331 పరుగుల వద్ద నిలిచింది.