సోమవారం, 29 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్

సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే కోపంతో అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది

knife
గుజరాత్ రాష్ట్రంలో ఓ ఉన్మాది అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. సోషల్ మీడియాలో తనను బ్లాక్ చేసిందన్న అక్కసుతో ఓ యువకుడు పక్కింటి అమ్మాయి గొంతు కోసి హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్ రాష్ట్రంలోని గాంధీ ధామ్‌‍లోని భరత్ నగర్‌లో నివాసం ఉంటోంది. వారి ఇంటి పక్కనే నిందితుడు మోహిత్ సిద్ధపారా(22) కుటుంబం కూడా నివసిస్తోంది. బాధితురాలు భుజ్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ బీసీఏ చదువుతోంది. ఇరుగుపొరుగువారు కావడంతో వారిద్దరికి ముందు నుంచి పరిచయం ఉంది. గతంలో ప్రేమించుకున్న వారిద్దరు మధ్య గొడవలు తలెత్తడంతో విడిపోయారు. తల్లి సలహా మేరకు బాధితురాలు మోహిత్ నంబర్‌ను బ్లాక్ చేసింది. దీన్ని జీర్ణించుకోలేకపోయిన మోహిత్... తన స్నేహితుడితో కలిసి బాధిత యువతి చదివే కళాశాల దగ్గరకు వెళ్లాడు. 
 
సోషల్ మీడియాలో ఎందుకు బ్లాక్ చేశావని సంస్కార్ పాఠశాల సమీపంలో అమ్మాయితో గొడవపడ్డాడు. ఇకపై తనను ఇబ్బంది పెట్టొద్దని, మళ్లీ కలవడానికి ప్రయత్నించొద్దని ఆ అమ్మాయి గట్టిగా చెప్పింది. దీంతో పట్టరాని కోపంతో నిందితుడు అకస్మాత్తుగా దాడిచేసి ఆ అమ్మాయి గొంతుకోశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్నేహితుడిని కూడా కత్తితో గాయపరిచి పరారయ్యాడు. 
 
తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటిరోజు మరణించింది. ఈ ఘటనపై కచ్ ప్రాంతంలో తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తమయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మోహిత్‌ను అదుపులోకి తీసుకుని, అతనిపై హత్య కేసు నమోదు చేశారు.