మంగళవారం, 30 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2025 (16:19 IST)

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

OG Four Day Collections
OG Four Day Collections
డివివి ఎంటర్ టైన్ మెంట్ పై పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఓజీ.. దే కాల్ హిమ్ ఓజీ చిత్రం గత గురువారం విడుదలైంది. మొదటిరోజు  అనూహ్యమైన కలెక్లన్లతో క్రేజ్ తెచ్చుకుంది. ప్రియాంక మోహన్ కథానాయికగా ప్రకాష్ రాజీ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ హైప్ బలమైన బజ్‌తో ప్రారంభమైంది.
 
కాగా, ఈ చిత్రం మొదటి వారాంతంలో అనగా 4 రోజులు ప్రపంచవ్యాప్తంగా రూ. 252 కోట్లు వసూలు చేసిందని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ చిత్రానికి అత్యధిక కలెక్షన్లలో ఒకటిగా నిలిచింది, ఇది అతని బాక్సాఫీస్ స్టామినాను పునరుద్ఘాటించింది. మరో వైపు ఈ సినిమాకు ఫ్యామిలీస్ రావడం ప్రారంభిస్తే మరింతగా పెరిగే అవకాశముందని నిర్మాణ వర్గాలు తెలియజేస్తున్నాయి.
 
ఇమ్రాన్ హష్మి ఈ  చిత్రంలో విలన్‌గా నటించారు. ఈ చిత్రంలో శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్  కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సౌండ్‌ట్రాక్‌ను సమకూర్చారు.