ప్రియుడితో ఐదు రోజులుగా కోడలు, రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసిన అత్తామామలు
కోడలు తమ అత్తమామల కన్నుగప్పి ఐదు రోజులుగా ప్రియుడితో ఏకాంతంగా గడుపుతోంది. ఐతే ఐదు రోజుల తర్వాత అత్తామామలు అకస్మాత్తుగా కోడలి గదికి వెళ్లడంతో ప్రియుడితో తమ కోడలు అభ్యంతరకర రీతిలో కనిపించింది. దాంతో వాళ్లు షాక్ తిన్నారు. కోడలికి అంతకంటే ఎక్కువగా షాకిస్తూ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఏంటది?
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బీహార్ రాష్ట్రం లోని భాగల్ పూర్లో ఓ వివాహిత స్త్రీకి పెళ్లికి ముందే ప్రియుడు వున్నాడు. వీరిద్దరూ అదను దొరికినప్పుడల్లా కలుసుకుని తమ బంధాన్ని సాగిస్తూ వచ్చారు. ఐతే ఈ మహిళ గత ఏడాది బిట్టు అనే యువకుడిని పెళ్లి చేసుకున్నది. తనకు ప్రియుడు వున్నప్పటికీ పెద్దలను ఎదిరించలేక తాళి కట్టించుకున్నది. పెళ్లయ్యాక బిట్టు ఉద్యోగ నిమిత్తం బెంగళూరు వెళ్లిపోయాడు. పదిహేను రోజులకో నెలరోజులకో ఒకసారి వచ్చి వెళ్తున్నాడు.
తన తల్లిదండ్రుల ఇంట్లో కాకుండా భార్యకోసం విడిగా ఓ ఇల్లు కొనుగోలు చేసి ఆమెను అక్కడే పెట్టేసాడు. ఇరుగుపొరుగువారు కూడా వుండటంతో భయమేమి వుండదని బిట్టూ ఆమెకి చెప్పాడు. ఈ క్రమంలో ఆమె వద్దకు అత్తమామలు మూడునాలుగు రోజులకొకసారి వచ్చి వెళ్తుండేవారు. ఇదే అదనుగా బిట్టూ భార్య తన పాత స్నేహాన్ని కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నది.
ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకున్నది. అత్తమామలు వస్తున్నప్పుడు అతడిని పైఅంతస్తులోని రేకుల షెడ్డులో దాచి పెట్టేసేది. వారు వెళ్లిపోగానే మళ్లీ ఇద్దరూ ఏకాంతంగా కలుస్తుండేవారు. ఐతే ఆదివారం నాడు ఆమెకి చెప్పాపెట్టకుండా అత్తామామలు ఇంటికి వచ్చేసారు. అకస్మాత్తుగా వచ్చేసరికి తన ప్రియుడితో కోడలు పట్టుబడింది. ఇది కాస్తా ఊరంతా తెలిసిపోవడంతో గ్రామస్తులంతా అక్కడికి వచ్చేసారు.
బిట్టూకి తల్లిదండ్రులు ఫోన్ చేసి భార్య వ్యవహారం చెప్పారు. వారంతా చర్చించుకుని తమ కోడలిని ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఓ బాండ్ పేపరు తెచ్చి కోడలు, ఆమె ప్రియుడితో సంతకాలు చేయించి పెళ్లి కానించేసారు. బిట్టూ సైతం తన భార్య ప్రియుడితోనే అధిక సమయం గడుపుతోంది కనుక ఇక తనకు నా అవసరం లేదనీ, వాళ్లిద్దరికి పెళ్లి చేయడం మంచిదంటూ ఫోనులో చెప్పేసాడు. అలా కోడలిని ఆమె ప్రియుడికే ఇచ్చి పెళ్లి చేసి ఇంటి నుంచి సాగనంపారు ఆమె అత్తామామలు.