శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 నవంబరు 2024 (17:37 IST)

విశాఖలో లా విద్యార్థినిపై సామూహిక అఘాయిత్యం...

victim girl
విశాఖపట్టణంలో ఓ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. మూడో సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిపై సహచర విద్యార్థితో పాటు మరో ముగ్గురు స్నేహితులు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధురవాడలోని ఎన్సీపీలా కాలేజీలో బాధితురాలు మూడో సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుది. తన సహచర విద్యార్థి అయిన వంశీతో ఆమె స్నేహంచేసింది. తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించన వంశీ... గత ఆగస్టు 10వ తేదీన కంబాలకొండకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత అదే నెల 13వ తేదీన డాబా గార్డెన్స్‌లో తన స్నేహితుడు ఆనంద్ ఇంటికి తీసుకెళ్లి మరోమారు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేశ్, జగదీశ్‌లు కూడా ఆమెపై  లైంగికదాడికి తెగబడ్డారు. ఆ దృశ్యాలను ఫోనులో చిత్రీకరించి, ఆ తర్వాత ఆమెను బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు.
 
రెండు నెలల తర్వాత ఆనంద్, రాజేశ్, జగదీశ్‌లు బాధితురాలికి ఫోన్ చేసి తమ వద్దకు రావాలని లేనిపక్షంలో వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు. ఈ విషయాన్ని వంశీ దృష్టికి తీసుకెళ్లింది. వంశీ కూడా తన స్నేహితుల కోరిక తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఈ వేధింపులు మరింతగా పెరిగిపోవడంతో ఆమె సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు కుమార్తెను నిలదీయగా అసలు విషయం చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు.ే