శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 14 నవంబరు 2024 (17:33 IST)

నన్ను ప్రేమిస్తావా లేదా?: ఇనుప రాడ్డుతో యువతిపై ప్రేమోన్మాది దాడి

victim
విశాఖపట్టణం జిల్లా పెదగంట్యాడ మండలంలో యువతిపై ఓ ప్రేమోన్మాది దాడి చేసి కలకలం సృష్టించాడు. గత కొన్ని రోజులుగా యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఐతే అతడితో ప్రేమ పేరుతో వేధించవద్దంటూ గట్టిగా హెచ్చరించింది. దాంతో రెచ్చిపోయిన ప్రేమోన్మాది నీరజ్ శర్మ ఇనుప రాడ్డుతో ఆమెపై దాడికి దిగాడు.
 
విచక్షణారహితంగా తలపై కొట్టడంతో తీవ్రగాయాలపాలైంది. తనను ప్రేమించడం లేదన్న కక్షతో ప్రేమోన్మాది దాడికి దిగినట్లు ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.