కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. అత్తారింటికి కుమార్తెను అప్పగిస్తున్న వేళ ఓ తల్లి గుండె ఆగిపోయింది. దీంతో అప్పటివరకు ఎంతో సంతోషంగా కళకళలాడుతున్న పెళ్లింట విషాదం నెలకొంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
భద్రాద్రి జిల్లాలోని కామేపల్లి మండంల అబ్బాసుపురం తండాకు చెందిన బానోత్ మోహన్ లాల్ కళ్యాణి (38) అనే దంపతులు ప్రథమ కుమార్తె సింధును టేకులపల్లి మండలం కొత్తతండాకు చెందిన యువకుడితో ఎంతో సంతోషంగా ఆదివారం వివాహం జరిపించారు.
సాయంత్రం కుమార్తె అప్పగింతల కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన తల్లి బానోతు కళ్యాణి ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతిచెందింది. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది.