శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2024 (09:53 IST)

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఎస్ఐ (Video)

si suicide
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వాజేడులో విషాదకర ఘటన  చోటుచేసుకుంది. వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. తన సర్వీస్ రివాల్వర్‌తోనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగిన పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎస్ఐ సూసైడ్ చేసుకోవడంతో కలకలం సృష్టిస్తుంది. 
 
గత నెలలో ఈయన విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ఫార్మర్స్ నెపంతో మావోయిస్టులు ఇద్దరి స్ధారణ పౌరులను పట్టుకుని హత్య చేశారు. అప్పటి నుంచి హరీష్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకోవడంతో పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.