గురువారం, 25 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (13:36 IST)

బేస్‌బాల్ బ్యాట్‌తో మహిళా కానిస్టేబుల్‌ను కొట్టి చంపిన భర్త

murder
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధి జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. బేస్‌బాల్ బ్యాట్‌తో భార్య అయిన మహిళా కానిస్టేబుల్‌ను కొట్టి చంపేశాడు. పోలీస్ క్వార్టర్స్‌లో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సిధి జిల్లాలోని ప్రభుత్వ పోలీస్ క్వార్టర్స్‌లో సవితా సాకేత్ (హెడ్ కానిస్టేబుల్), ఆమె భర్త వీరేంద్ర సాకేత్ నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లులు కూడా ఉన్నారు. అయితే, ఆదివారం రాత్రి సవిత వంట గదిలో భోజనం సిద్ధం చేస్తుండగా, భార్యాభర్త మధ్య ఏదో విషయంపై వాగ్వాదం జరిగింది.
 
ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త వీరేంద్ర, పక్కనే ఉన్న బేస్‌బాల్ బ్యాట్ తీసుకుని సవితపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా తలకు బలంగా దెబ్బ తగలడంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సవిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. భర్తను అదుపులోకి తీసుకుని ఆ దంపతుల మధ్య గొడవకు దారితీసిన అంశాలపై ఆరా తీస్తున్నారు.