ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?
ఉదయాన్నే సరైన అల్పాహారం తీసుకోనట్లయితే శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఫలితంగా పలు రుగ్మతలు పట్టుకుంటాయి. అందువల్ల ఆరోగ్యాన్నిచ్చే ఎంపికలను చేసుకుంటూ ఏది ఎలా తినాలో అదే తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాంటి ఎంపికలు ఏమిటో తెలుసుకుందాము.
ఉదయాన్నే పాలు తాగే అలవాటు కొందరికి వుంటుంది, ఇలా చేస్తే ప్రోటీన్లు తక్కువగానూ చక్కెర స్థాయిలు అధికంగా శరీరంలో చేరి చేటు చేస్తాయి.
ఉదయాన్నే కాఫీ లేదా టీతో కలిపి బిస్కెట్లు తినే అలవాటు ఆకలిని చంపేస్తుంది, దీనితో అల్పాహారం కొద్దిగానే తినగలుగుతారు.
కొందరికి శాండ్‌విచ్ తినే అలవాటు వుంటుంది. ఉదయాన్నే అవి తింటే ఒక్కసారిగా బ్లడ్ షుగర్ స్థాయిలు పెరిగిపోతాయి.
ఉప్మా, పోహాలు తినాలనుకునేవారు వాటిలో కాస్త కాయగూరలు లేదా గింజలను కలిపి ఉడికించి తింటుంటే మేలు కలుగుతుంది.
ఉదయాన్నే కొందరు ఓట్స్ తినేసి అల్పాహారం తీసుకోరు. అలా కాకుండా ఉడకబెట్టిన కోడిగుడ్డును తింటే శరీరానికి అవసరమైన శక్తి చేకూరుతుంది.
ఫైబర్ స్థాయిలు ఎక్కువగా వున్న పండ్లను తింటే మంచిది. కొందరు కేవలం పండ్ల రసాలను తాగేసి ఏమీ తినకుండా వుంటారు. ఇది మంచిది కాదు.