శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (23:18 IST)

బెల్లం టీ తాగితే 7 ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

jaggery tea
బెల్లం టీలో జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
బెల్లం టీ తాగితే జలుబు, దగ్గు నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
ఆస్తమా, బ్రాంకటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
బెల్లం టీలోని పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
బెల్లం టీ జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది, మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.
బెల్లం టీ ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
బెల్లం టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నందున ఇది కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో మేలు చేస్తుంది.
బెల్లం టీలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.