శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 18 సెప్టెంబరు 2023 (17:05 IST)

బాదం పప్పును ఖాళీ కడుపుతో తినవచ్చా?

Almonds
బాదం పప్పు తినడం వల్ల తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అని పిలువబడే చెడు రకమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) స్థాయిలను పెంచుతుంది. బాదంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. బాదం పప్పులు తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. బాదం చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, వీటిని తింటే బ్లడ్ షుగర్ నియంత్రించవచ్చు.
 
బాదం గుండెకు మంచిదని నిపుణులు చెపుతారు. బాదం రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బాదంలో అనేక పోషకాలు ఉన్నందున ఈ పోషకాల శోషణను పెంచడానికి వీటిని ఖాళీ కడుపుతో తినవచ్చు. బాదం పప్పులు తింటుంటే బరువు అదుపులో వుంటుంది.
బాదంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బాదం పప్పు కంటికి మేలు చేస్తుంది. బాదంపప్పులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది.