శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 8 మే 2024 (23:17 IST)

వేసవిలో ఈ డ్రై ఫ్రూట్స్‌ను పాలలో కలుపుకుని తాగితే?

dry dates with milk
ఆరోగ్యవంతమైన శరీర నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ వేసవిలో మీరు ఈ డ్రై ఫ్రూట్‌లను పాలతో కలిపి తినవచ్చు. వేటిని ఇలా తినవచ్చునో తెలుసుకుందాము.
 
కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉన్న మఖానాను పాలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.
ఇది ఎముక నొప్పి, వాపు తగ్గించడానికి ఎంతగానో మేలు చేస్తుంది.
బాదంలో విటమిన్ ఇ, ప్రొటీన్, ఫైబర్ వంటి గుణాలు ఉంటాయి.
బాదంపప్పును మెత్తగా నూరి పాలలో కలుపుకుని తాగవచ్చు.
రోజూ 4-5 ఖర్జూరాలు తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.
ఖర్జూరాలను రాత్రంతా పాలలో నానబెట్టి తినవచ్చు.
ఈ ఖర్జూరాలను ఉదయం పాలలో ఉడికించి కూడా తినవచ్చు.