శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 20 అక్టోబరు 2024 (20:26 IST)

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

Ferty9
తిరుపతి అబ్‌స్టెట్రిక్స్- గైనకాలజికల్ సొసైటీ సహకారంతో ఫెర్టి9 ఈరోజు తిరుపతిలో వైద్య సదస్సును నిర్వహించింది. ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్ రంగంలో, ముఖ్యంగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవిఎఫ్)లో ఆరోగ్య సంరక్షణ నిపుణుల పరిజ్ఞానం, నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా చేసుకుంది.  సంతానోత్పత్తి సంరక్షణలో రోగి ఫలితాలను మెరుగుపరచడానికి తాజా సాంకేతికతలు, అందుబాటులోని ఉత్తమ పద్ధతులను ఈ  సమావేశం వెల్లడించింది. 
 
భారతదేశంలో, దాదాపు 28 మిలియన్ల జంటలు సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిశ్చల జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి స్థాయిలు, ఊబకాయం, ఇతర వైద్యపరమైన కారణాల వల్ల ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వైద్య సదస్సులోని చక్కటి నిర్మాణాత్మక మాడ్యూల్స్, వైద్యులు ఈ డిమాండ్‌ను తీర్చడానికి అవసరమైన సాధనాలను అందించారు. పునరుత్పత్తి వైద్యంలో తాజా ఆవిష్కరణలపై వారు పూర్తి అవగాహన కలిగి వుంటారనే  భరోసాను అందిస్తుంది.   
 
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా నుండి 130 కంటే ఎక్కువ గైనకాలజిస్టులు, ఐవిఎఫ్ నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సమావేశంలో దేశంలోనే అత్యంత గౌరవనీయమైన సంతానోత్పత్తి నిపుణుల నేతృత్వంలో విజ్ఞానపరమైన కార్యక్రమాలు, కేస్ స్టడీ చర్చలు జరిగాయి. ఇక్కడ చర్చించిన ముఖ్య అంశాలలో ఐవిఎఫ్ పద్ధతులు, సంతానోత్పత్తి సంరక్షణ ఎంపికలు, ఫలితాలను మెరుగుపరచడంలో జన్యు పరీక్ష పాత్ర- సంతానోత్పత్తి సంరక్షణకు రోగి-కేంద్రీకృత విధానాలు వంటివి ఉన్నాయి.
 
"సంతానోత్పత్తి చికిత్సలు అభివృద్ధి చెందుతూనే ఉన్నందున, ఈ పురోగతిలో ముందంజలో ఉండటం మనకు చాలా కీలకం. ఈ అభ్యాస సదస్సులు పునరుత్పత్తి వైద్య రంగంలో కొత్త పరిజ్ఞానం, మెళకువలను వ్యాప్తి చేయడంలో కీలకం అని ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సి బుడి అన్నారు. "సంతానోత్పత్తి పరిష్కారాలను కోరుకునే జంటలు ఈరోజు అందుబాటులో ఉన్న అత్యంత ప్రభావవంతమైన, వినూత్నమైన సంరక్షణను పొందేలా చూడటం మా లక్ష్యం" అని వెల్లడించారు. 
 
ఫెర్టి9 ఫెర్టిలిటీ సెంటర్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ సునీత సాధు మాట్లాడుతూ, “వంధ్యత్వంతో పోరాడుతున్నప్పుడు కలిగే భావోద్వేగాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది ఆ జంట జీవితంలోని సంబంధాల నుండి మానసిక ఆరోగ్యం వరకు ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ భావోద్వేగ భారాన్ని గుర్తించడం చాలా అవసరం. అయితే, సరైన మద్దతుతో, అంటే కౌన్సెలింగ్ లేదా సమాజ మద్దతు ద్వారా, అధునాతన వైద్య చికిత్సలను కూడా అందిస్తే, ఆశకు మార్గం ఉంది. ఫెర్టి9 వద్ద, మనం సంయుక్తంగా ఈ సవాలుతో కూడిన ప్రయాణాన్ని అధిగమించగలమని నమ్ముతున్నాము, తద్వారా మాతృత్వ ప్రయాణ మార్గం మరింత అందుబాటులోకి వస్తుంది. తక్కువ సమస్యాత్మకంగా ఉంటుంది" అని అన్నారు. 
 
ఫెర్టి9 ఫెర్టిలిటీ సెంటర్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ దీప్తి దామోదర మాట్లాడుతూ, “వంధ్యత్వం అనేది పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేసే సంక్లిష్టమైన సమస్య, తరచుగా ఒంటరితనం మరియు నిరాశ భావాలను సృష్టిస్తుంది. చికిత్సలో ఈ సమస్యలను అన్ని విధాలుగా పరిష్కరించడం ముఖ్యం. ఫెర్టి9 వద్ద, మేము ప్రతి జంట యొక్క ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా వినూత్న పరిష్కారాలను, వ్యక్తిగతీకరించిన సంరక్షణను అందించడంపై దృష్టి పెడతాము. అధునాతన వైద్య సాంకేతికతకు ప్రేమతో కూడిన చికిత్సను కలపడం ద్వారా, తల్లిదండ్రులుగా మారాలనే వారి ప్రయాణంలో కొత్త ఆశ, విశ్వాసాన్ని కనుగొనడానికి మేము జంటలను శక్తివంతం చేస్తున్నాము" అని అన్నారు. 
 
సంతానోత్పత్తి, పునరుత్పత్తి ఆరోగ్య రంగంలో వైద్య విద్యను అభివృద్ధి చేయడానికి ఫెర్టి9 లోతుగా కట్టుబడి ఉంది. అభివృద్ధి చెందుతున్న, ఇప్పటికే గుర్తింపు పొందిన ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం సమగ్ర శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లు, సెమినార్‌లను స్థిరంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాలు సంతానోత్పత్తి చికిత్సలు, రోగనిర్ధారణ పద్ధతులు, రోగి సంరక్షణలో తాజా పురోగతిపై దృష్టి సారిస్తాయి, అభ్యాసకులు అత్యాధునిక జ్ఞానం, నైపుణ్యాలను కలిగి ఉన్నారని నిర్ధారిస్తుంది. నిరంతర అభ్యాసం, భాగస్వామ్య సంస్కృతిని పెంపొందించడం ద్వారా, సంతానోత్పత్తి సంరక్షణ ప్రమాణాలను పెంచడం, భారతదేశంలోని రోగులకు మెరుగైన ఫలితాలను అందించటం ఫెర్టి9 లక్ష్యంగా చేసుకుంది.