శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 26 అక్టోబరు 2024 (22:40 IST)

ఈ సమయాల్లో మంచినీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

drinking water
మంచినీరు. నీరే కదా ఏముందిలే అని అనుకుంటాము. ఐతే నిర్దుష్ట సమయాల్లో మంచినీరు త్రాగితే, అది పూర్తి ప్రయోజనాలను ఇస్తుంది. మంచినీరు త్రాగడానికి సరైన సమయాలు ఏమిటో తెలుసుకుందాము.
 
రాగి పాత్రలో రాత్రిపూట ఉంచిన నీటిని ఉదయాన్నే తాగితే మలబద్ధకం నుండి ఉపశమనం లభించి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల కండరాలు, కొత్త కణాలు ఏర్పడతాయి.
స్నానం చేసిన వెంటనే నీరు త్రాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య వదిలించుకోవచ్చు.
భోజనానికి 1 గంట ముందు, భోజనానికి 1 గంట తర్వాత నీరు త్రాగడం మంచిది.
పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
నీటిని సరిగ్గా తాగడం వల్ల శరీరంలో జీవక్రియ పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది
ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది.
ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల బహిష్టు, క్యాన్సర్, డయేరియా, మూత్ర సంబంధిత సమస్యలు, క్షయ, వాత, తలనొప్పి, కిడ్నీ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.