శుక్రవారం, 17 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 7 అక్టోబరు 2025 (23:10 IST)

వామ్మో... యువతి ప్యాంటు జేబులో పేలిన ఫోను, మంటలు (video)

Phone explodes in young woman-s pants pocket
మొబైల్ ఫోన్లను వాడేవారు వాటి పట్ల ఎంతో జాగ్రత్తగా వుండాలి. చాలామంది గంటలకొద్దీ ఫోనులో మాట్లాడుతూ, బ్యాటరీ అయిపోతుందనీ, చార్జింగ్ వైర్ పెట్టి మాట్లాడేస్తుంటారు. ఇలా రకరకాలుగా ఏవి చేయకూడదో అలాంటివి చేస్తూ ప్రమాదాలను తెచ్చుకుంటారు. అందుకే సెల్ ఫోన్ వాడకం గురించి తెలుసుకోవడం మంచిది.
 
ఇక అసలు విషయానికి వస్తే... బ్రెజిల్ దేశంలో ఓ యువతి సరుకులు తీసుకుంటూ వుండగా అకస్మాత్తుగా తన ప్యాంటు వెనుక జేబులో వున్న మొబైల్ ఫోను పేలింది. ఈ ఘటనతో ఆమె కేకలు వేస్తూ పరుగులు తీసింది. ఐనప్పటికీ ఆమె చేతులకు, వెనుక భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అంతా కెమేరాలో రికార్డయ్యింది. చూడండి ఆ వీడియోను...