శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 25 జులై 2024 (12:53 IST)

భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ దేశ పౌరులకు అమెరికా డ్వైజరీ

భారత్‌లో పర్యటించే తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా ఓ అడ్వైజరీ జారీ చేసింది. భారత్‌లోని మణిపూర్, జమ్మూకాశ్మీర్, ఇండో పాక్ సరిహద్దు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పర్యటించవచ్చని కోరింది. ముఖ్యంగా భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలని సూచన చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసింది. 
 
దేశంలో పెరుగుతోన్న నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. భారత్ - పాకిస్థాన్ సరిహద్దులోని 10 కి.మీల పరిధిలో కాల్పులు జరిగే అవకాశం ఉన్నందున అటువైపు వెళ్లొద్దని సూచించింది. అలాగే, తూర్పు లడ్డాఖ్ ప్రాంతం, లేహ్ మినహా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్లోనూ పర్యటించాని కోరింది. అక్కడ ఉగ్రవాదం, అశాంతి నెలకొందని, ఉగ్రవాదం, హింసాత్మక ఘటనల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనపై పునరాలోచించాలని సూచించింది. 
 
పలు పర్యాటక ప్రాంతాలు, ఇతర చోట్ల అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి హింసాత్మక నేరాలు జరిగాయని తెలిపింది. ఉగ్రవాదులు పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు/షాపింగ్ మాల్స్, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటారని తెలిపింది. భారత్-పాక్ మధ్య నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి హింసాత్మక ఘటనలు సాధారణంగా జరుగుతుంటాయని.. ఇది కాశ్మీర్ లోయలోని పర్యాటక ప్రదేశాలైన శ్రీనగర్, గుల్ మార్గ్, పహల్గామ్లలో చోటుచేసుకుంటాయని తెలిపింది. అందువల్ల ఈ పర్యాటక ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాలను సందర్శించేందుకు భారత ప్రభుత్వం కూడా విదేశీ పర్యటకులను అనుమతించదని పేర్కొంది. 
 
సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైనిక బలగాలు మోహరించి ఉంటాయని తెలిపింది. తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుంచి బెంగాల్ మీదుగా విస్తరించి ఉన్న ప్రాంతంలో మావోయిస్టు గ్రూపులు చురుగ్గా ఉంటాయని తెలిపింది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌తో పాటు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ, బిహార్, బెంగాల్, ఒడిశాలలో ప్రభుత్వ అధికారులపై దాడులు జరుగుతున్నాయని, ఒడిశాలోని నైరుతీ ప్రాంతంలోనూ ఈ ప్రభావం ఉందన్నారు. మావోయిస్టులు స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలు, ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తున్నారని తెలిపింది. అందువల్ల ఈ ప్రాంతాల్లో పర్యటించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేసింది. 
 
ఈశాన్య ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పలు జాతులకు చెందిన గ్రూపులు పాల్పడుతున్నాయని తెలిపింది. ఈ ఘటనల్లో బస్సులు, రైళ్లు, రైలు మార్గాలు, మార్కెట్లపై బాంబు దాడులు జరుగుతున్నాయని.. అస్సాం, నాగాలాండ్ , అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, సిక్కిం, త్రిపురలో హింసాత్మక ఘటనలు జరిగాయని అడ్వైజరీలో పేర్కొంది.