శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2024 (16:54 IST)

భారత్ లో మరో నాలుగు యాపిల్ స్టోర్లు.. ఐఫోన్ 16 ప్రో సిరీస్ విడుదల

apple store
భారతదేశంలో పూణె, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబైలలో ఉన్న మరో నాలుగు స్టోర్లను ప్రారంభించనున్నట్లు ఐఫోన్ తయారీదారు ఆపిల్ శుక్రవారం తెలిపింది. ఈ నెలలో తమ మొట్టమొదటి "మేడ్ ఇన్ ఇండియా" ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ సిరీస్ పరికరాలను కూడా విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
 
దేశంలోని మా కస్టమర్‌ల సృజనాత్మకత, అభిరుచితో ప్రేరణ పొంది.. భారత్ లో.. మరిన్ని స్టోర్లను తెరవాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆపిల్ వెల్లడించింది. భారత దేశంలో స్టోర్ల ఏర్పాటు వల్ల మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆపిల్ తెలిపింది. 
 
ఆపిల్ అద్భుతమైన ఉత్పత్తులు, సేవల కోసం షాపింగ్ చేయండని.. అసాధారణమైన, పరిజ్ఞానం ఉన్న బృంద సభ్యులతో కనెక్ట్ అవ్వండని యాపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓబ్రెయిన్ తెలిపారు.
 
ఏప్రిల్ 2023లో, యాపిల్ తన రెండు స్టోర్లను భారతదేశంలో ప్రారంభించింది. ఒకటి ఢిల్లీలో, మరొకటి ముంబైలో వుంది. "భవిష్యత్తులో ఆపిల్ రిటైల్ స్టోర్లు బెంగళూరు, పూణే, ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబైలలో ప్లాన్ చేయబడ్డాయి" అని ప్రకటన తెలిపింది. 
 
వచ్చే ఏడాది యాపిల్ దుకాణాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రస్తుతం భారతదేశంలో తయారు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌తో సహా మొత్తం ఐఫోన్ 16 లైనప్‌ను భారతదేశంలో తయారు చేస్తోందని యాపిల్ వెల్లడించింది.