శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2024 (20:11 IST)

Redmi Note 14 Pro+ 5G: రూ.30,999లకే భారీ డిస్కౌంట్.. ఫీచర్స్ ఇవే

Redmi Note 14 Pro+ 5G
Redmi Note 14 Pro+ 5G
ఫ్లిఫ్‌కార్ట్‌ ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో భాగంగా రెడ్‌ మీ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన Redmi Note 14 Pro+ 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీనిపై ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమైన ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. 
 
ఫ్లిఫ్‌కార్ట్‌లో Redmi Note 14 Pro+ 5G స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే పొందవచ్చు. మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజ్‌ ఆప్షన్స్‌తో పాటు మూడు విభిన్న కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. 
 
ఇందులోని బేస్‌ వేరియంట్ ధర MRP రూ.34,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 11 శాతం వరకు ఫ్లాట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఆఫర్స్‌ అన్ని పోనూ రూ.30,999లకే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఫోన్‌ రెండు ర్యామ్‌ వేరియంట్స్‌లో కూడా లభిస్తోంది.