శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2024 (19:11 IST)

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

snake
snake
మనుషుల కన్నా.. మూగ జీవాలు తమ వారు ఆపదలో ఉంటే వెంటనే అక్కడికి వెళ్లి వాలిపోతాయి. ఒక కోతి చనిపోతే.. వందలాది కోతులు అక్కడకు చేరుకుంటాయి. ఒక కాకి లేదా మరేదైన జీవి అయిన తమ సాటి జీవి మీద ఎంతో ప్రేమతో ఉంటాయి. కొన్నిసార్లు జంతువులు జాతీ వైరాన్ని మర్చిపోయి సాటి జీవి పట్ల ప్రేమతో ప్రవర్తిస్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో ఆవు పొలంలో పచ్చిక మేస్తుంది. మరీ అక్కడకు పాము వచ్చినట్లుంది. అసలైతే.. పాము చాలా విషపు జీవి. ఎవరైనా దాని దరిదాపుల్లోకి వచ్చినట్లు అన్పిస్తే వెంటనే కాటు వేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. ఆవు మాత్రం.. ప్రేమతో పామును తన నాలుకతో నాకుతుంది. అదే విధంగా పాము కూడా ఆవుకు ఎలాంటి అపకారం తలపెట్టకుండా.. అలానే ఉండిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.