మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. ప్రేమ కవితలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 12 ఆగస్టు 2024 (20:53 IST)

నా అడుగులు నీవైపు, నీ అడుగులు నావైపు

lovers
ఆ దరి, ఈ దరి, దూరం, తీరం
నింగీ, నేల, ఆకాశం, శూన్యం
వెన్నెల, వెలుగు, చీకటి
ఎటు చూసినా నీవే
 
నా సంతోషం, నా ఆశ
నా ఆనందం, నా కోరిక
నా తృప్తి, నా అనురక్తి
అన్నీ నువ్వే
 
నా అడుగులు నీవైపు
నీ అడుగులు నావైపు
నా సంతోషం నీలోనే
నీ ఆనందం నాతోనే
 
ఏకమైన రెండు తనువులు మనం
ఒక్కటైన రెండు మనసులు మనం
కలిసిపోయిన రెండు హృదయాలు మనం
పెనవేసుకున్న జన్మజన్మల బంధం మనం