శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 నవంబరు 2024 (22:42 IST)

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

victim
బహిర్భూమిని వెళ్లిన 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో జరిగింది. బహిర్భూమికి వెళ్లి.. చాలా సమయం గడిచినా తిరిగిరాలేదు. ఆమె కోసం బాధితురాలి తండ్రి వెతుక్కుంటూ వెళ్లాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులను చూశాడు. 
 
బాలిక కోసం తండ్రి అరవడం మొదలెట్టాక.. అక్కడున్న ముగ్గురు పరుగెత్తారు. ఆ తర్వాతే తన కుమార్తె లైంగిక దాడికి గురైన విషయం తెలియవచ్చింది. నవంబర్ 16న ఈ ఘటన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు వేలూరు ఆల్‌ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు.