బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జనవరి 2025 (13:44 IST)

ఐదుగురు మావోయిస్టులను చంపేసిన నక్సలైట్లు!

maoists
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోస్టులు చేసిన దాడిలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ కగార్‌లో భాగంగా, విధులు నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. ఛత్తీస్‌‌గఢ్ రాష్ట్రంలోని బీజాపుర్ జిల్లాలో సోమవారం జవాన్‌ను వెళ్తున్న వాహనాన్ని ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్)తో పేల్చివేశారు. ఈ ఘటనలో మొత్తం 9 మంది మరణించారు. ఈ మృతుల్లో ఐదుగురు మాజీ మావోయిస్టులని పోలీసు అధికారులు తాజాగా వెల్లడించారు.
 
మృతులు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్)కు చెందిన హెడ్ కానిస్టేబుల్ బుద్రామ్ కొర్సా, కానిస్టేబుళ్లు డుమ్మా మార్కం, పండారు రామ్, బయన్ సోది, బస్తర్ ఫైటర్స్‌కు చెందిన కానిస్టేబుల్ సోమడు వెట్టిగా పోలీసులు గుర్తించారు. వీరంతా గతంలో క్రియాశీలక మావోయిస్టులని, లొంగిపోయిన తర్వాత పోలీసు బలగాల్లో చేరారని బస్తర్ రేంజి ఐజీ సుందర్రాజ్ తెలిపారు.
 
కోర్సా, సోధి బీజాపూర్ జిల్లాకు చెందిన వారు కాగా.. మిగితావారు దంతెవాడ జిల్లా పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తులని చెప్పారు. బస్తర్ ప్రాంతంలోని స్థానిక యువకులు, లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ నియమించుకుంటారు. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రాన్ని వేధిస్తున్న తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటం కోసం ఏర్పడిన బృందమే.. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్. దీనికి రాష్ట్రంలో కీలక యాంటి-మావోయిస్టు ఫోర్స్ పేరుంది.
 
డీఆర్డీని మొదట కాంకర్ (ఉత్త బస్తర్), నారాయణప్పుర్ (అబుజ్‌ముద్) జిల్లాల్లో 2008లో ఏర్పాటు చేశారు. ఐదేళ్ల తర్వాత 2013లో బీజాపూర్‌లోనూ ఈ భద్రతా బలగాలను విస్తరించారు. 2014 నుంచి సుక్మా, కొండగావ్ జిల్లాల్లో 2015 నుంచి దంతెవాడలో ఈ బలగాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. ఇక 'బస్తర్ ఫైటర్స్' యూనిట్ 2022లో ఏర్పాటైంది. బస్తర్ సంస్కృతి, భాష, ప్రాంతంపై పట్టు, అక్కడి గిరిజనులతో సత్సంబంధాలున్న స్థానిక యువకులను బస్తర్ ఫైటర్స్ పోలీసుశాఖ నియమించుకుంటోంది.