శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (12:20 IST)

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ పేరును ఖరారు చేసిన కేజ్రీవాల్!

atishi
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర మంత్రి అతిశీ పేరును ఆప్ కన్వీనర్, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎంపిక చేశారు. దీంతో ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్నదానిపై గత రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎం ఎవరన్న సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తన మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న అతిశీ పేరును ఆయన తదుపరి సీఎంగా ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం జరిగిన ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి ఎన్నికున్నారు. 
 
అతిశీ పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా, ఇతర ఎమ్మెల్యేలు బలపరిచారు. దీంతో ఢిల్లీ తుదపరి సీఎంగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ మంత్రివర్గంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి అతిశీ కావడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ అరెస్టయి జైలులో ఉన్న సమయంలో ఆమె కీలకంగా వ్యవహరించారు.