శుక్రవారం, 17 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 8 అక్టోబరు 2025 (21:20 IST)

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

Couple romance on a moving car
పైత్యానికి వెర్రితలలు వేస్తే ఎలా వుంటుందో ఇటీవలి కాలంలో కొంతమంది చేస్తున్న పనులు చూస్తే అలా వుంటోంది. పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఓ జంట నడిరోడ్డుపై రెచ్చిపోయి ప్రవర్తించింది. కారు టాప్ పైన కూర్చుని ఆ ఇద్దరు అసభ్యకరమైన పనులు చేసారు. రోడ్డుపై కారు కదులుతూ వుండగా వాళ్లిద్దరూ ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చుని ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్ చేస్తూ వెళ్లారు.
 
రోడ్డుపై వెళ్లేవారంతూ వీరి చర్యలను చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా వారలా ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారి చర్యలను వారి వెనుకే కారులో వస్తున్న కొంతమంది వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది. ఇలాంటి బరితెగించిన జంటలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు.