మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జనవరి 2025 (12:48 IST)

జనవరి 7, మధ్యాహ్నం 2 గంటలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

election commission of india
కొత్త యేడాదిలో ఎన్నికల సందడి మొదలైంది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నోటిఫికేషన్ జారీచేయనుంది. 
 
మొత్తం 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఈ యేడాది ఫిబ్రవరి 23తో గడువు ముగియనుంది. ఆలోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అంటే వచ్చే నెల మొదటి వారంలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. గతంలో 2020లో ఫిబ్రవరి 8వ తేదీన ఓటింగ్ నిర్వహించి అదే నెల 11వ తేదీన ఫలితాలను ప్రకటించారు. సాధారణంగా ఇక్కడ ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు.
 
ప్రస్తుత అసెంబ్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సంఖ్యాబలం ఎనిమిదిగా ఉంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆప్.. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకుని కేంద్ర పాలిత ప్రాంతంలో పాగా వేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ఆప్ 70 మంది అభ్యర్థులను ప్రకటించగా. కాంగ్రెస్, బీజేపీ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి.